శ్లోకం - 1

ధృతరాష్ట్ర ఉవాచ: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

తాత్పర్యం

ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికెను: ఓ సంజయా! ధర్మస్ధలమైన కురుక్షేత్రంలో యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న నా పుత్రులైన కౌరవులు మరియు పాండు కుమారులైన పాండవులు ఏం చేస్తున్నారు?