శ్లోకం - 2

సంజయ ఉవాచ: దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్య ముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: యుద్ధ వ్యూహాలతో సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి, దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పెను.