శ్లోకం - 4
అత్ర శూరా మహేష్వాసాః భీమార్జునసమా యుధి | యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
తాత్పర్యం
దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఈ పాండవ సైన్యంలో ఎంతో ధైర్యవంతులు, అస్త్రాల ఉపయోగంలో నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులైన సాత్యకి(యుయుధానుడు), విరాట మహారాజు, ద్రుపద మహారాజు మహారథులుగా ఉన్నారు.