శ్లోకం - 5
ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ | పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||
తాత్పర్యం
దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైభ్యుడు వంటి మహాయోధులు ఉన్నారు.