శ్లోకం - 6
యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||
తాత్పర్యం
దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారులైన ఉపపాండవులు ఉన్నారు. వీరంతా కూడా మహారథులే.