శ్లోకం - 13
తత శ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః | సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: తరువాత కౌరవ వీరులంతా శంఖాలు, డప్పులు, తాళాలు మరియు కొమ్మువాద్యములు మ్రోగించడంతో ఆ ప్రాంతమంతా భయంకరమైన శబ్దంతో ప్రతిధ్వనించింది.