శ్లోకం - 14

తత శ్శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ | మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: తదనంతరం తెల్లని గుర్రాలతో కూడిన మహారథంపై కూర్చొని ఉన్న మాధవుడైన శ్రీకృష్ణుడు, పాండుపుత్రుడైన అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు.