శ్లోకం - 16
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః | నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: కుంతీ పుత్రుడు మరియు మహారాజైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) "అనంత విజయము" అను శంఖమును, నకులసహదేవులు సుఘోషమణిపుష్పకములను శంఖములు పూరించిరి.