శ్లోకం - 17
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః | ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: గొప్ప ధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాట మహారాజు, ఓటమి ఎరుగని సాత్యకి తమ శంఖములను పూరించిరి.