శ్లోకం - 20
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః | ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః || హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ చక్రవర్తి! తదనంతరం యుద్ధ ప్రారంభ సమయంలో హనుమంతుడి చిహ్నంతో ఉన్న పతాకము గల రథముపై పాండురాజు కుమారుడైన అర్జునుడు సమరానికి సిధంగా ఉన్న మీ కుమారులని చూసి తన ధనుస్సుని తీసుకొని హృషీకేశుడైన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.