శ్లోకం - 25

భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ | ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: భీష్ముడు, ద్రోణాచార్యుడుతో పాటు ఇతర కౌరవ రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, "ఇక్కడ ఉన్నటువంటి కురు వంశ వీరులందరిని చూడుము."