శ్లోకం - 26
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ | ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా || శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయో రపి ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: అప్పుడు అర్జునుడు ఇరు సేనలలో ఉన్న తన పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను బంధువులందరినీ చూశాడు.