శ్లోకం - 30
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే | న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: గాండీవం చేతినుండి జారిపోతున్నది, శరీరం మండుతున్నది, నా మనస్సు తల్లడిల్లుతున్నది కనుక స్థిరంగా నిలబడలేక పోతున్నాను.