శ్లోకం - 32
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ | కిం నో రాజ్యేన గోవింద కిం భోగై ర్జీవితేన వా? ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, నేను విజయం, రాజ్యాధికారం లేదా సుఖం కోరుకోవడం లేదు. గోవిందా! ఈ రాజ్యం, భోగములు, జీవితం వలన ప్రయోజనం ఏముంది?