శ్లోకం - 33
యేషా మర్థే కాంక్షితం నః రాజ్యం భోగా స్సుఖాని చ | త ఇమే௨వస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: మనం ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకున్నామో వారంతా ధనము మరియు ప్రాణాలు వదలటానికి సిద్ధంగా ఉండి యుద్ధం చేయుటకు నిలిచి ఉన్నారు.