శ్లోకం - 35

ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతో௨పి మధుసూదన | అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా! వారు నా మీద దాడి చేసినను నేను వారిని వధించలేను. ముల్లోకాలనూ పాలించే అవకాశం వచ్చినా నాకు మాత్రం వారిని సంహరించాలనే కోరిక లేదు. అలాంటిది ఈ రాజ్యం కోసం వాళ్ళను చంపగలనా?