శ్లోకం - 36
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్స్యా జ్జనార్దన | పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా! ధృతరాష్ట్ర కుమారులను చంపినచో మనకు ఎలా సంతోషము కలుగును? ఈ పాపాత్ములను చంపడం వలన మనకు పాపం చుట్టుకుంటుంది.