శ్లోకం - 37
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ | స్వజనం హి కథం హత్వా సుఖిన స్స్యామ మాధవ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కనుక ఓ మాధవా, బంధువులైన దుర్యోధనాదులను చంపటానికి మనం అర్హులం కాదు. సొంత వారిని చంపి మనం సుఖంగా ఎలా ఉండగలం?