శ్లోకం - 42
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ | పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: చెడు సంతానము వృద్ధిచెందటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును. కుల నాశనము వలన శ్రాద్ధ తర్పణములు చేయక పూర్వికులు అధోగతి పాలయ్యెదరు.