శ్లోకం - 43
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః | ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కులాచారములను నాశనము చేసి, చెడు సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన సనాతన కులధర్మములు, జాతిధర్మములు నశించిపోవును.