శ్లోకం - 45
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ | యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అయ్యో! రాజ్యాధికారాన్ని పొందాలన్న కోరికతో మన సొంత వారిని చంపటానికి పూనుకొని ఈ మహా పాపం చేయడానికి సిద్ధపడ్డాము. ఇది ఎంత దారుణము.