శ్లోకం - 5

గురూనహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే | హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నా గురువులైన మహానుభావులను చంపడం కంటే బిచ్చమెత్తుకొని బ్రతకడం మేలు. వీరిని సంహరించి రక్తసిక్తమైన భోగభాగ్యాలు ఎలా అనుభవించగలను.