శ్లోకం - 8

న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణామ్ | అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ దుఃఖము నన్ను దహించివేయుచున్నది. దీన్ని పోగొట్టే ఉపాయము నాకు తెలియడం లేదు. నేను ఈ భూమ్మీద అసమానమైన రాజ్యాన్ని సంపాదించినా, లేదా దేవతలకు సమానమైన అధికారాన్ని సంపాదించినా, నేను ఇంకా ఈ దుఃఖాన్ని తగ్గించుకోలేను.