శ్లోకం - 11
శ్రీభగవానువాచ: అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే | గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, దుఃఖించదగని వారి కోసం దుఃఖిస్తున్నావు. అంతేకాకుండా మహాజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. మరణించిన వారి గురించి కాని అలాగే బ్రతికున్న వాళ్ళ గురించి కాని జ్ఞానులు దుఃఖించరు.