శ్లోకం - 22
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి | తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎలాగైతే మానవుడు పాత బట్టలను వదిలి కొత్త వస్త్రాలను ధరించునో, అలాగే మరణం తర్వాత ఆత్మ పాత శరీరంను విడిచిపెట్టి కొత్త శరీరంను పొందుతుంది.