శ్లోకం - 23

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః | న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ ఆత్మను ఆయుధాలు ముక్కలుగా నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు.