శ్లోకం - 25

అవ్యక్తో௨యమచింత్యో௨యం అవికార్యో௨యముచ్యతే | తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ కనిపించనిది, ఊహకు అందనిది మరియు మార్పులేనిది. ఆత్మ గురించి ఈ విషయములు తెలుసుకొనిన నీవు దేహం కోసం దుఃఖించటం తగదు.