శ్లోకం - 26

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ | తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, శరీరంతో పాటు ఆత్మకు కూడా చావు పుట్టుకలుంటాయని నీవు భావిస్తున్నప్పటికీ దీనికై నీవు దుఃఖించుట తగదు.