శ్లోకం - 27

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పుట్టిన వారందరికీ మరణం తప్పదు, మరణించిన వారందరికీ పునర్జన్మ తప్పదు. కనుక, ఈ అనివార్య వాస్తవికత గురించి దుఃఖించుట తగదు.