శ్లోకం - 28
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత | అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ భరత వంశీయుడా, పుట్టుకకు ముందు కానీ లేదా మరణం తరువాత కానీ శరీరం యొక్క స్థితి ఏమిటన్నది తెలియదు. వీటి మధ్యకాలంలో ఉన్న ప్రస్తుత స్థితి మాత్రమే మనకు తెలుసు. అటువంటి శరీరం గురించి శోకించుటమెందుకు?