శ్లోకం - 29

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః | ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు. ఇంకొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా మాట్లాడుతారు. మరికొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా వింటారు. విన్న తరువాత కూడా ఈ ఆత్మ యొక్క పూర్తి విశేషాలు ఎవరూ అర్థం చేసుకోలేరు.