శ్లోకం - 31
స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితు మర్హసి | ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో௨న్యత్ క్షత్రియస్య న విద్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీ స్వధర్మమును చూసిననూ నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మ యుద్ధానికి మించిన కర్తవ్యం మరొకటి లేదు.