శ్లోకం - 32

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్ | సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా, ఎంతో పుణ్యం చేసుకున్న క్షత్రియులకు మాత్రమే ఇలాంటి యుద్ధ అవకాశం కలుగును. అలాంటి ఈ సంగ్రామం వలన నీకు స్వర్గమునకు ద్వారములు తెరుచుకోనున్నాయి.