శ్లోకం - 33
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి | తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్యసి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అందుచేత, ఒకవేళ నీవు ఈ ధర్మ యుద్ధాన్ని చేయకపోతే అప్పుడు నీ స్వధర్మమును పాటించని పాపమును పొందడమే కాక యోదుడుగా నీ కీర్తిని కూడా కోల్పోతావు.