శ్లోకం - 35

భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః | యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహారథులందరూ నీవు భయం చేతనే యుద్ధ రంగం నుండి పారిపోయావనుకుంటారు. ఇంతకుముందు వరకు నిన్ను గౌరవించిన వారందరూ ఇక నుండి చులకనగా చూస్తారు.