శ్లోకం - 37
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ | తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ ధర్మయుద్ధంలో నీవు చనిపోతే స్వర్గప్రాప్తి పొందుతావు లేదా విజయం సాధిస్తే ఈ భూమండలంపై రాజ్యభోగాలు అనుభవిస్తావు. కాబట్టి కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధముకమ్ము.