శ్లోకం - 38
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ | తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను మరియు జయ అపజయాలను సమానంగా భావించి బాధ్యతగా యుద్ధం చేయుము. ఈ విధంగా చేసినచో నీకు ఎలాంటి పాపము కలగదు.