శ్లోకం - 39

ఏషా తే௨భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు | బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), ఇంతవరకు నేను సాంఖ్యము అనగా ఆత్మ తత్త్వం గురించి వివరించాను. ఇప్పుడు కర్మ యోగం గురించి వివరిస్తాను, వినుము. ఇది గ్రహించి పాటించినచో నీవు కర్మ బంధముల నుండి విముక్తి పొందగలవు.