శ్లోకం - 42

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః | వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, పరిమితమైన జ్ఞానం కలిగిన అవివేకులకు వేదాల్లో చెప్పబడిన స్వర్గం మరియు సకామకర్మల యందు ఆకర్షింపబడుదురు. స్వర్గమే గొప్పదని దానికి మించింది మరొకటి లేదని వాదిస్తూ ఉంటారు.