శ్లోకం - 46

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే | తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నది నుండి నీటిని తెచ్చుకునేవారు బావికి ఎలా ప్రాముఖ్యత ఇవ్వరో అదే విధంగా బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలం పొందాలనే ఆశతో వేదకర్మలకు ప్రాధాన్యత ఇవ్వరు.