శ్లోకం - 47

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో௨స్త్వకర్మణి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మలు చేయుటకే నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలముల యందు నీకు అధికారము లేదు. నీవే కర్మ ఫలములకు కారణం అని ఎప్పుడూ భావించకు మరియు ప్రతిఫలం ఆశించి కర్మలు చేయకు. అలాగని నీవు చేయవలసిన కర్మలు మానేయాలని అనుకోకు.