శ్లోకం - 48

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ | సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ ధనంజయా(అర్జునా), జయాపజయములందు ఆసక్తి వీడి నీవు సమ భావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఈ సమత్వ భావమునే యోగము అని అందురు.