శ్లోకం - 49

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ | బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ ధనంజయా, సమత్వ బుద్ధితో చేసే నిష్కామకర్మల కన్నా ప్రతిఫలాన్ని ఆశించి చేసే కర్మలు ఎంతో హీనమైనవి. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు. ఫలములను ఆశించి కర్మలు చేసేవారు దీనులు, అల్పులు.