శ్లోకం - 50
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే | తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమత్వబుద్ధితో కర్మలు ఆచరించినవారు ఈ లోకము నందే అనగా ఈ జన్మలోనే పుణ్య పాపములను రెండింటినీ విడిచిపెట్టెదరు. అందుచేత ప్రతిభతో పని చేయడం అనే యోగము కొరకు ప్రయత్నింపుము.