శ్లోకం - 52

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి | తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీ బుద్ధి మోహమనే ఊబి నుండి బయటపడినప్పుడు నీవు విన్న, వినవలసిన ఇహపర లోక భోగములయందు నీకు విరక్తి కలుగుతుంది.