శ్లోకం - 53
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా | సమాధావచలా బుద్ధిః స్తదా యోగమవాప్స్యసి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదముల యందు చెప్పబడిన కామ్యకర్మలచే ప్రభావితము కాకుండా నీ యొక్క బుద్ధి భగవంతుని యందు స్థిరంగా ఉంచినచో అప్పుడు నీవు యోగమును పొందగలవు.