శ్లోకం - 54

అర్జున ఉవాచ: స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ | స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్? ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కేశవా(కృష్ణా), సమత్వ బుద్ధి కలిగిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలేమిటి? అతడు ఎలా మాట్లాడును? ఎలా కూర్చుండును? ఎలా నడుచును?