శ్లోకం - 55

శ్రీ భగవానువాచ: ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ | ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), ఇంద్రియములను తృప్తి కలిగించు సర్వ కోరికలను మరియు స్వార్థ ప్రయోజనాలను విడిచిపెట్టి, శుద్ధమైన మనస్సుతో ఆత్మను అర్థం చేసుకోవడంలో సంతృప్తిని పొందినవాడు స్థితప్రజ్ఞుడని పిలువబడుతాడు.