శ్లోకం - 56

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః | వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దుఃఖముల యందు క్రుంగనివాడు, సుఖముల యందు కోరికలేనివాడు, మమకారం, భయం మరియు కోపాన్ని వదిలి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు.