శ్లోకం - 57
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ | నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే దేనియందునూ మమకారం పొందడో, వాటివల్ల కలిగే శుభానికి ఆనందించాడో, అశుభానికి నిరుత్సాహపడడో అలాంటి వ్యక్తి జ్ఞానమే స్థిరమైనది, అతడే స్థితప్రజ్ఞుడవుతాడు.